బాలల దినోత్సవానికి భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యత..
బాలల దినోత్సవ శుభాకాంక్షలు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ నవంబర్ 14: దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 14 నవంబర్‌ను బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టం దాంతో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజును జరుపుకుంటారు. పిల్లలే దేశ భవిష్యత్తు అని ఆయన నమ్మాడు. పిల్లలు పూర్తిగా వికసించటానికి సంరక్షణ, పోషణ అవసరమయ్యే మొగ్గలవంటివారని ఆయన తరచుగా చెబుతూ ఉండేవాడు. బాలల దినోత్సవం అనేది పిల్లల అమాయకత్వం, ఉత్సుకత, శక్తి, ఉత్సాహాన్ని జరుపుకునే రోజు బాలల దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, బాలల హక్కులు, వారి సంక్షేమం మరియు వారి భవిష్యత్తు భద్రత గురించి ఆలోచించడానికి సమయం దొరికిన సందర్భం. ఈ రోజు పండిట్ నెహ్రూ గొప్ప కృషికి గుర్తు చేసుకోవడానికి, నివాళులర్పించే రోజు స్వాతంత్య్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు, భారతదేశాన్ని పునర్నిర్మించడంలో, ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో ఇంకా బలోపేతం చేయడంలో పండిట్ నెహ్రూ పోషించిన పాత్రను భారతదేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది. బాలల హక్కులు, వారి సంక్షేమం, వారి సంతోషం గురించి సమాజానికి అవగాహన కల్పించడమే బాలల దినోత్సవం ఉద్దేశం. నేడు పిల్లల బాల్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సాంకేతిక ప్రపంచం, సామాజిక మాధ్యమాలు, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌ల దుష్ప్రభావాలలో చాలా మంది పిల్లలు చిక్కుకుపోతున్నారు. పాఠశాలలు, ప్రవేశ పరీక్షల నుండి కఠినమైన పోటీ, భవిష్యత్తు గురించి ఆందోళనలు వారిని చిన్ననాటి సరళతకు దూరం చేస్తున్నాయి. ఈ సమస్యల నుంచి వారిని గట్టెక్కించేందుకు మార్గాలు సుగమం చేయనున్నారు. పిల్లల మనసు, ఆలోచనలు, భావాలను మనం గౌరవించాలి. పిల్లల బాల్యం వారి జీవితంలో అత్యంత విలువైన వారసత్వం అని మనం అర్థం చేసుకోవాలి.
బాలల దినోత్సవానికి భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పిల్లల హక్కులను, వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు గురించి సవాళ్లను గుర్తించి, వారికి మంచి ప్రగతిని అందించాలనే ఆలోచనను ముందుకు తీసుకెళ్లడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. పండిత జవహర్ లాల్ నెహ్రూ పిల్లలను దేశ భవిష్యత్తుగా భావించి, వారికి గౌరవం ఇవ్వడం మరియు వారి అభిరుచులు, కలల పట్ల శ్రద్ధ చూపించడంలో నమ్మకం కలిగేవారు. అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించారు. ఈ దినోత్సవం ద్వారా పిల్లల పట్ల సమాజం జాగృతమవడం, వారి హక్కులు మరియు అవసరాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పిల్లలకు సరైన మార్గదర్శకత్వం, ప్రేమ, పాఠశాల విద్యను అందించడంతో పాటు, వారిలో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ఈ రోజుకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది.