మలికిపురం AFDT విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలి..

Get real time updates directly on you device, subscribe now.

అమలాపురంలో అంబరాన్ని అంటిన ఏఐఎస్ఎఫ్ సంబరాలు..

అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా కె. వెంకట్, జి. రవికుమార్ ఎన్నిక..

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతులు వెంటనే కల్పించాలి..

మలికిపురం AFDT విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలి..

ఏఐఎస్ఎఫ్ డిమాండ్..
హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/అంబేద్కర్ కోనసీమ జిల్లా/ అమలాపురం/నవంబర్ 10: ఆదివారం 10.11.2024 న అమలాపురం పట్టణంలో ప్రెస్ క్లబ్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధమ మహాసభను నిర్వహించుకోవడం జరిగింది. అమలాపురం బస్ స్టాండ్ నుండి గడియార స్తంభం వరకు వందలాది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి AISF హిస్టరీ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యలపై విద్యార్థులు అందరూ సమరశంఖం పూరించాలని ప్రసంగించారు. అనంతరం అమలాపురం ప్రెస్ క్లబ్ వద్ద మాజీ విద్యార్థి నాయకులు జె. యేసురాజుచే AISF పతాక ఆవిష్కరణ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి కళాకారులచే అభ్యుదయ గేయాలపనతో ప్రతినిధుల సభ ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశంకి ముఖ్య అతిధిలుగా AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల నాసర్ జీ, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, AISF మాజీ రాష్ట్ర నాయకులు దేవ రాజేంద్ర హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విద్యారంగా సమస్యలు పరిష్కారం విద్యార్థుల పోరాటం వల్లే జరుగుతుందని, దేశ స్వాతంత్రంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం AISF అని, 89 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని పొరాటాలు కొనసాగిస్తూనే ఉందని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్య విధానాం వలన అనేక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమవుతున్నారని ఈ విధానానికి వ్యతిరేకంగా వినుకొండ నియోజకవర్గంలో పోరాటాలు నిర్వహించాలని అన్నారు. రాష్ట్రం లో సుమారుగా 70 వేల మంది sc, st, bc విద్యార్థులు జీవో నెంబర్ 77 వలన ఉన్నత పీజీ విద్యకు దూరమవుతున్నారని. గతంలో యువగళం పాదయాత్రలో నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ జీవో నెం.77ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట మీద నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మటిక్ చార్జీలను విడుదల చేయాలని అన్నారు.  అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కె.వెంకట్, జి.రవికుమార్ లను ఎన్నుకోవడం జరిగిందని  తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులు గా వెన్నెల, సతీశ్, సందీప్, సహాయ కార్యదర్సులుగా సాయిరామ్, భాను కార్తిక్, రషిద్, కోశాధికారి గా లావణ్య ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 19 సమితి సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకులు యేసు దాసు, రామకృష్ణ , కొండలరావు, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్స్ ప్రెస్  న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి :
ఏ.వి.సూర్య నారాయణ

హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/అంబేద్కర్ కోనసీమ జిల్లా/ అమలాపురం/నవంబర్ 10: ఆదివారం 10.11.2024 న అమలాపురం పట్టణంలో ప్రెస్ క్లబ్ నందు అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధమ మహాసభను నిర్వహించుకోవడం జరిగింది. అమలాపురం బస్ స్టాండ్ నుండి గడియార స్తంభం వరకు వందలాది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి AISF హిస్టరీ, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సమస్యలపై విద్యార్థులు అందరూ సమరశంఖం పూరించాలని ప్రసంగించారు. అనంతరం అమలాపురం ప్రెస్ క్లబ్ వద్ద మాజీ విద్యార్థి నాయకులు జె. యేసురాజుచే AISF పతాక ఆవిష్కరణ చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి కళాకారులచే అభ్యుదయ గేయాలపనతో ప్రతినిధుల సభ ప్రారంభించడం జరిగింది. ఈ సమావేశంకి ముఖ్య అతిధిలుగా AISF రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల నాసర్ జీ, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు, AISF మాజీ రాష్ట్ర నాయకులు దేవ రాజేంద్ర హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విద్యారంగా సమస్యలు పరిష్కారం విద్యార్థుల పోరాటం వల్లే జరుగుతుందని, దేశ స్వాతంత్రంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం AISF అని, 89 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలని పొరాటాలు కొనసాగిస్తూనే ఉందని అన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన జాతీయ విద్య విధానాం వలన అనేక మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు పాఠశాల విద్యకు దూరమవుతున్నారని ఈ విధానానికి వ్యతిరేకంగా వినుకొండ నియోజకవర్గంలో పోరాటాలు నిర్వహించాలని అన్నారు.

రాష్ట్రం లో సుమారుగా 70 వేల మంది sc, st, bc విద్యార్థులు జీవో నెంబర్ 77 వలన ఉన్నత పీజీ విద్యకు దూరమవుతున్నారని. గతంలో యువగళం పాదయాత్రలో నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ జీవో నెం.77ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట మీద నిలబడి విద్యార్థులకు న్యాయం చేయాలని అన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెండింగ్ లో ఉన్న మెస్, కాస్మటిక్ చార్జీలను విడుదల చేయాలని అన్నారు.  అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కె.వెంకట్, జి.రవికుమార్ లను ఎన్నుకోవడం జరిగిందని  తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులు గా వెన్నెల, సతీశ్, సందీప్, సహాయ కార్యదర్సులుగా సాయిరామ్, భాను కార్తిక్, రషిద్, కోశాధికారి గా లావణ్య ల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 19 సమితి సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకులు యేసు దాసు, రామకృష్ణ , కొండలరావు, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్స్ ప్రెస్  న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి :
ఏ.వి.సూర్య నారాయణ

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment