హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /అల్లూరి సీతారామరాజు జిల్లా/ చింతూరు మండలం/నవంబర్ 09: శనివారం 9/11/2024 రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కల్లేరు గ్రామంలో యువతీ యువకులకు మాదక ద్రవ్యలు వాడటం వల్ల జరిగే అనర్ధాల గురించి అంగన్వాడీ కార్యకర్త సోడె లక్ష్మి, మాట్లాడుతూ బాల్యం దశ నుండే యువకులు మాదక ద్రవ్యాలకు బానిసైపోతున్నారు. తల్లిదండ్రులు ఎంతో ఆశతో మా పిల్లలు ప్రయోజకులు కావాలని కలలు కంటూ ఉంటారు. కానీ పిల్లలు వారి కళలను ఆశయాలను చిదిమేస్తున్నారని గంజాయి మత్తు పదార్థాలకు లోనవకుండా మంచి ఉన్నత చదువులు చదివి మంచి పేరు తెచ్చేవారుగా ఉండాలని కల్లేరు గ్రామంలో యువకులకు తెలియజేయడం జరిగింది. కల్లేరు గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది.
నవతరంగ్ ప్రతినిధి :ప్రసాద్