ఎమ్మెల్యే స్టికర్ వాహనంతో యువకుల హల్చల్.. అరెస్టు..

Get real time updates directly on you device, subscribe now.

ఎమ్మెల్యే స్టిక్కర్ తో ఉన్న వాహనం సీజ్ చేసిన రేపల్లె పోలీసులు

ఎమ్మెల్యే స్టికర్ వాహనంతో యువకుల హల్చల్

మంత్రి అనగానికి అనుచరుల మంటూ దందాలు

కేసు నమోదు… ముద్దాయిల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్/జిల్లా బాపట్ల /రేపల్లె ఇంచార్జ్/అక్టోబర్ 30: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అనుచరులమంటూ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ తో సంచరిస్తున్న యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్టు పట్టణ సిఐ మల్లికార్జున రావు తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గుంటూరుకు చెందిన అభినయ్ అనే వ్యక్తి గత 7 నెలల క్రితం విజయవాడ బీసెంట్ రోడ్డులో స్టిక్కర్లు తయారు చేసే సల్మా అనే వ్యక్తి వద్ద ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేరుతో కార్ పాస్ ను చేయించాడు. అక్రమంగా తయారు చేసిన ఎమ్మెల్యే అనగాని కార్ పాస్ ను ఏపీ 07 డీఎస్ 8322 నంబర్ గల మహేంద్ర ఎక్స్యువి 500 వాహనానికి వేసుకొని తిరుగుతున్నాడని చెప్పారు. ముద్దాయి అభినయ్ తన కారుతో టోల్గేట్ ల వద్ద ఎమ్మెల్యే పేరుతో అక్రమంగా డబ్బు చెల్లించకుండా తిరుగుతున్నాడని వివరించారు. ఇవి కాకుండా తన సొంత అవసరాలకు ఎమ్మెల్యే పేరును ఉపయోగించుకొని విజయవాడ, గుంటూరు, రేపల్లె తదితర ప్రాంతాలలో యదేచ్ఛగా తిరుగుతున్నాడని చెప్పారు.

అయితే ఈనెల 28వ తేదీన అభినయ్ అనే వ్యక్తి తన స్నేహితులైన చందు, సాంబశివరావు లను వెంటబెట్టుకొని రేపల్లెకు వచ్చాడు. రేపల్లెలో తిరుగుతున్న కారును గమనించిన మంత్రి కార్యాలయ వ్యక్తిగత సహాయకుడు యార్లగడ్డ ధర్మ తేజ చూసి సదరు వ్యక్తులను మీరు ఎవరని ప్రశ్నించాడు. అయితే అభినయ్ అతని స్నేహితులు ధర్మతేజను నువ్వు ఎవరు అంటూ దూషించి కారు తీసుకొని వెళ్ళి పోయారని తెలిపారు. వెంటనే స్పందించిన ధర్మ తేజ రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ధర్మ తేజ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ముద్దాయిలను పట్టుకొని కారును సీజ్ చేసినట్టు తెలిపారు. ముద్దాయిలపై సిఆర్పి నంబర్ 196/2024 అండర్ సెక్షన్ 336(3),115(2),351(2), రెడ్ విత్ 3/5 బీఎన్ ఎస్ క్రింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతూ అధికారులు నాయకులకు సంబంధించిన స్టిక్కర్లను వేసుకొని అక్రమంగా సంచరించినట్లైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment