జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలని ఐటీడీఏ ముట్టడి
ఆంధ్రప్రదేశ్/ అల్లూరి సీతారామరాజు జిల్లా / చింతూరు మండలం/ హ్యూమన్ రైట్స్ టుడే/అక్టోబర్ 30: ఆదివాసీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో గిరిజన ప్రాంత ప్రజలకు జీవో నెంబర్ 3 ని పునరుద్ధరించి 100% ఉద్యోగాలు ఆదివాసి గిరిజనులకే వారి ప్రాంతంలో వారికి కల్పించాలని ఐటీడీఏ ముట్టడి. ఈ కార్యక్రమంలో అధికార ప్రభుత్వం ఎన్నికలకు ముందు గిరిజన ప్రాంతంలో జీవో నెంబర్ 3 ని తీసుకొచ్చి మీ ప్రాంతంలో మీ ఆదివాసులకే 100% ఉద్యోగాలు తీసుకొస్తామని ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ మాట నిలబెట్టుకొని డీఎస్సీ నీ ఏజెన్సీ డీఎస్సీగా ప్రకటించి జీవో నెంబర్ 3 ప్రకారంగా ఏజెన్సీ నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు కల్పించాలని ఆదివాసి నిరుద్యోగులు ప్రజా ప్రతినిధులు మా హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని ర్యాలీలైన నిరాహార దీక్షల కైనా ప్రాణ త్యాగానికైనా వెనకాడమని గట్టిగా ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది.
ఎక్స్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి : ప్రసాద్