హ్యూమన్ రైట్స్ టుడే/ఇంటర్నెట్ డెస్క్/అక్టోబర్ 28: తమిళనాడు విల్లుపురం జిల్లాలోని విక్రవాండిలో తమిళగ వెట్రి కళగం మొదటి మహానాడును ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభకు 8 లక్షలకు పైగా జనం వచ్చి ఉంటారని మీడియాలో ప్రచారం జరుగుతుంది.
విజయ్ తన ప్రసంగంలో సినిమా రంగం, రాజకీయం రెండు వేరు వేరు అని తేల్చిచెప్పారు. రాజకీయం అంటే యుద్ధ భూమి అని తాడో పేడో తేల్చుకునేందుకే వచ్చానని చెప్పాడు. పార్టీ కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
తమిళనాడులో అధికార డీఎంకే పార్టీని ప్రతిపక్ష అన్నా డీఎంకే డీ కొట్టలేక పోతుంది. ప్రతిపక్ష పార్టీలలో రాజకీయ శూన్యత, బలమైన రాజకీయ నేతలు లేకపోవడం ఒక ప్రధాన కారణం. జయలలిత తర్వాత డీఎంకే పార్టీని ప్రతిఘటించే నేత లేకపోవడం, శశికళ జైలుపాలు అవ్వడం, అన్నా డీఎంకే రెండుగా విడిపోవడంతో బలహీనం అయినది.