ఆగమైతున్న తెలంగాణ..

Get real time updates directly on you device, subscribe now.

ఆగమైతున్న తెలంగాణ..అన్ని వర్గాల ఆందోళన..!!

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 28: రేవంత్ సర్కార్ అసమర్థత, పాలనపై పట్టు లేకపోవడంతో అట్టుడుకుతోంది తెలంగాణ. గతంలో ఎన్నడూ లేనివిధంగా పది నెలల్లోనే ప్రజలు నుంచి రేవంత్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మా గోడు వినండి అంటూ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు, ధర్నాలు చేస్తూ రోడ్లెక్కారు.

సీసీఐ కొర్రీలతో పత్తి రైతన్నలు, రైతు భరోసా కోసం అన్నదాతలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యార్థులు, బ్యాక్‌లాగ్‌ పోస్టుల కోసం గురుకుల అభ్యర్థులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, జీతాలు సరిగ్గా రాక ప్రభుత్వ ఉద్యోగులు, తమ భర్తలతో గొడ్డు చాకిరీ చేయిస్తున్నారని కానిస్టేబుళ్ళ భార్యల ఆందోళనతో తెలంగాణ అట్టుడుకుతోంది.

చివరికి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనట్లు తొలిసారి యూనిఫాం వేసుకుని కానిస్టేబుల్స్ కూడా ఈ తుగ్లక్ రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. పసి పిల్లల నుంచి పండు ముసలి వరకు రోడ్లపైకి తీసుకురావడమేనా నువ్వు చెప్పిన ప్రజా పాలన? అని ప్రశ్నిస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment