జర్నలిస్టుల రక్షణకు చట్టాన్ని తీసుకురావాలి..

Get real time updates directly on you device, subscribe now.

కేంద్రాన్ని కోరిన ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా..

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/అక్టోబర్ 28: దేశంలో జర్నలిస్టుల భద్రత రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) కోరింది. దేశంలో మీడియా సిబ్బంది అరెస్టులు తప్పుడు నిర్బంధాలు బెదిరింపులపై ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులు గుర్బీర్‌సింగ్‌ రూపొందించిన నివేదికను పీసీఐ ఆమోదించింది. అయితే కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్‌ ప్రకాశ్‌ దేశారు నుంచి ఈ విషయంలో భిన్నాభిప్రాయం వ్యక్తమైనప్పటికీ నివేదికకు సమర్ధన లభించటం గమనార్హం. ఈ నివేదిక కేంద్రానికి ప్రధానంగా మూడు ప్రతిపాదనలను చేసింది. అందులో మొదటిది దేశంలో జర్నలిస్టుల రక్షణ భద్రత కోసం జాతీయ చట్టాన్ని ప్రకటించటం. అలాగే, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌కు మరిన్ని అధికారాలు కలిగించాలనీ, ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే మీడియాతో వ్యవహరించే విధానంపై పోలీసులకు అవగాహన కల్పించటం చట్టాన్ని అమలు పరిచే సంస్థల ప్రవర్తన నిబంధనలను క్రోడీకరించాలని నివేదిక పేర్కొన్నది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment