పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ

Get real time updates directly on you device, subscribe now.

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: సిపి అభిషేక్ మహంతి..
హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్ జిల్లా/అక్టోబర్ 25: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమర వీరుల త్యాగాలు చిర స్మరణీయమని, పోలీస్ అధికారులు కొనియాడారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

విధుల్లో ప్రాణాలను కోల్పోయిన పోలీసు అమర వీరులను స్మరిస్తూ, సమాజంలో శాంతి భద్రతల స్థాపనకు పోలీసులు చేస్తున్న కృషి పట్ల ప్రజలకు అవగాహన కలిగే విధంగా ఈ సైకిల్ ర్యాలీ ఉపయోగపడుతుందని సీపీ తెలియ జేశారు.

కరీంనగర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని అన్ని విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు నగరంలోని పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, తదితరులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారన్నారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ.

బస్టాండ్ ఇన్ గేట్, ఇందిరా చౌక్, రాంనగర్ పాత లేబర్ అడ్డా మీదుగా, శివ థియేటర్ జంక్షన్, కెమిస్ట్రీ భవన్ మీదుగా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్, త్రీ టౌన్ మీదుగా కమాన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీసు స్టేషన్ తిరిగి బస్ స్టాండ్ మీదుగా పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్ద ముగిసింది.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ జయ్ కుమార్ లతో పాటు పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment