హ్యూమన్ రైట్స్ టుడే /వరంగల్ జిల్లా:
భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారం భారతరత్న ప్రతి ఏడాది భారతరత్న ప్రకటిస్తారు. కానీ 2023 కి ఇప్పటి వరకు ప్రకటించలేదు కానీ భారతరత్న తరువాతత అత్యున్నతమైనటు వంటి పురస్కారాలు అయినటువంటి పద్మావిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలు. పలుగ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ఎంపిక చేస్తారు. 2023 సంవత్సరానికి పద్మ విభూషణ్ 06, పద్మభూషణం 09, పద్మశ్రీ 91, పురస్కరాలు ప్రకటించారు. ఇందులో తెలుగువారైనా తెలంగాణ వారికి రెండు పద్మ భూషన్, పద్మశ్రీలు ఐదు అలాగే ఆంధ్రప్రదేశ్ ఎడు పద్మశ్రీలు దక్కినాయి.
పద్మ అవార్డుల చరిత్ర: 1954 సంవత్సరంలో ఈ పద్మ అవార్డులను స్థాపించారు. వీటిని మూడు వర్గాలు మొదటి వర్గం, రెండవ వర్గం, ముడవ వర్గం గా విభజించారు. 1955 సంవత్సరంలలో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఎంపిక చేస్తారు.
పద్మ విభూషణ్: దేశంలో అత్యున్నతమైనటువంటి అసాధారణమైన, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులకి ఇవ్వబడుతుంది ఇది దేశంలోనే రెండవ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం.
పద్మభూషణ్: ఉన్నత స్థాయికి చెందినటువంటి వ్యక్తులు గాని, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించినటువంటి భారతీయులైనటువంటి వ్యక్తులకి ఈ పురస్కారం అందించబడుతుంది.
పద్మశ్రీ : భారత దేశంలో అత్యున్నతమైన పురస్కారం నాలుగవ పురస్కారం పద్మశ్రీ. విశిష్ట సేవలకు గుర్తింపుగా పద్మశ్రీని అందజేస్తారు.
అవార్డుల ఎంపిక: ప్రతి ఏడాది ప్రధానమంత్రి రూపొందించే పద్మ అవార్డుల కమిటీ సిఫార్సుల మేరకే పద్మ అవార్డులు అందజేస్తారు. ఈ కమిటీపై కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ పర్యవేక్షణలో మరియు రాష్ట్రపతి కార్యదర్శి, కేంద్ర హోమ్ సెక్రటరీ, ఐదుగురు సభ్యులు ప్రముఖులు ఉంటారు. ఎంపిక చేసిన జాబితను ఈ కమిటీ రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి కి సమర్పిస్తారు.
అర్హతలు: భారతీయులయి ఉండి జాతి, కుల, మత, లింగ, వర్ణ, ప్రాంతీయ బేధాలు లేకుండా వ్యక్తులు అందరూ అర్హులు (విదేశీయులు కూడా అర్హులే)
ఎవరికి ఇస్తారు: మూడు పౌర పురస్కాల్ని విశిష్టమైన పనులు చేసిన వారికి వారిని గుర్తించి మరి అన్ని రంగాలలో విజయాలు సేవలకు గుర్తింపుగా ఇవ్వబడుతుంది. అలాగే కళలు పెయింటింగ్స్, శిల్పం, సంగీతం సేవ, ఫోటోగ్రఫీ థియేటర్, సినిమా, షార్ట్ ఫిలిం డాక్యుమెంటరీ మొదలైన వాటికి. అలాగే ప్రజా సేవలో పరిపాలనలో సేవలు అందించిన వారికి సాహిత్యం, విద్యారంగం సేవ, విద్యసంస్కరణలు, నిరక్షరాస్య నిర్మూలనలో విశేష కృషి చేసిన వారికి. అలాగే వైద్య సేవ రంగంలో పరిశోధనలో ఆయుర్వేదం, అల్లోపతి, హోమియోపతి, నేత్రోపతిలో విశిష్ట సేవలు అందించిన వారికి, సైన్సు మరియు ఇంజనీరింగ్ లో పరిశోధన చేసి నూతన ఆవిష్కరణలు చేసినటువంటి వారికి, సామాజిక సేవ స్వచ్ఛంద సేవ, క్రీడలు సహా లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి అలాగే వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, బ్యాంకింగ్, వ్యవస్థ, టూరిజంలో సేవలు అందించిన వారికి ఆందజేస్తారు. భారతీయ సంస్కృతి ప్రచారం, మానవ హక్కులు, గిరిజన హక్కుల పరిరక్షణ, వణ్య ప్రాణ రక్షణ, వృక్ష సంపద రక్షణ మొదలైన రంగంలో సేవ చేసిన వారిని గుర్తించి అందిస్తారు.
పద్మ అవార్డులు మొదటగా 1954 నుండి ప్రారంభించడం జరిగింది. 1954 లో 17, 1955 లో 14 పురస్కారాలు, 2020 లో 118, 2021 సంవత్సరం లో 119, 2022 సంవత్సరంలో 128, 2023 సంవత్సరంలో 106 మందికి పద్మ అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులు కొన్ని అవరోధాల వల్ల ఈ సంవత్సరాల్లో అవార్డుల ప్రకటించలేదు 1978, 1979, 1993, 1994, 1995, 1996, 1997 సంవత్సరానికి ప్రకటించలేదు.
కొంతమంది వ్యక్తులకు అనుకూలంగా ఉండేలా చాలా మందికి అత్యంత అరహత కలిగిన కళాకారులను వదిలివేశారు అనేటువంటి విమర్శల వల్ల ఇప్పుడు ఈ పురస్కారాల్ని నామినేషన్ ఆన్లైన్ పద్ధతిలో స్వీకరిస్తున్నారు.
పద్మ అవార్డుల తిరస్కరణ: భారతీయ అత్యున్నతమైనటువంటి పురస్కారల్ని అనేకమంది గ్రహితులు త్యాదించారు లేదా తిరస్కరించారు. కొందరు వ్యక్తులు గౌరవాన్ని మొదట గౌరవించి, అంగీకరించి తర్వాత తిరిగి ఇచ్చివేసినారు.
2023 సంవత్సరానికి పద్మ విభూషణ్06, పద్మభూషణ్ 09 పద్మశ్రీ 91 అవార్డులు ప్రకటించారు. తెలుగువారికి అందులో తెలంగాణ వారికి లభించిన అవార్డులు ఈ క్రింది విధంగా కలవు.
పద్మ భూషణ్-
1) చిన్న జీయర్ స్వామి: ఆధ్యాత్మికత, జ్యోతి కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక ఉద్యమాన్ని చేస్తూ, సమతా మూర్తి విగ్రహ రూపశిల్పి. ఈయన 1956 లో జన్మించారు. ఆధ్యాత్మికత కార్యక్రమాలతో పాటు జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా మొరుముల గ్రామాల్లో కూడా విద్యని అందిస్తున్నారు. అందులో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో బిరసాయిపేటలో విద్య సంస్థ స్థాపించి గిరిజనులకి విద్య సేవ అందిస్తున్నారు. అలాగే శంషాబాద్ లో శ్రీరామ నగరంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వివిధ సేవలకు కృషి చేస్తున్నారు.
2) కమలేష్ డి పటేల్: ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి తెలంగాణ కోటలో పద్మభూషణ్ అవార్డు లభించినది. హాట్ ఫుల్ నెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అండ్ ట్రస్ట్ వ్యవస్థాపక అద్యక్షులు. ఈయన గురువు రామచంద్ర గారి దగ్గర ఆధ్యాత్మికత ఆరంభించారు. 2014 నుండి శ్రీ రామచంద్ర మిషన్ ఇది రంగారెడ్డి జిల్లాలలో 1400 ఎకరాల్లో నిర్మించారు దీనికి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.
పద్మశ్రీ అవార్డులు: 1)డాక్టర్ హనుమంతు పసుపులేటి: హైదరాబాదు పాతబస్తీకి చెందినటువంటి వారు ఈయన 1945 సెప్టెంబర్ 16న జన్మించారు. వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసి, 1975 లో యం.డి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1977 సంవత్సరం లో పీహెచ్డీ పూర్తి చేసి మానసిక ఎదుగుదల లేనటువంటి పిల్లల కొరకు విశిష్టమైన సేవ చేశారు. మల్టీ స్పెషాలిటీ రిహాబిల్లి టేషన్ సెంటర్ వ్యవస్థాపకులు చైర్మన్. అలాగే వితంతువులు, నిరుపేదల సంరక్షణ ప్రచారంలలో సేవలు అందిస్తున్నారు. తన 45 ఏళ్ల కృషికి అవార్డు దక్కింది.
2) విజయ గుప్త యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి తెలంగాణ కోటలో పద్మశ్రీ లభించింది. భారతదేశంలో నీలి విప్లవంలో దశా దిశా చూపి చేపల ఉత్పత్తిలో గణనీయమైనటువంటి విశేష కృషిచేసి, మత్స్యకారుల యొక్క జీవితాల్లో వెలుగు నింపినారు. ఈయన కృషికి ఈ యొక్క అవార్డు లభించింది అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వానికి మత్స్యశాఖ సాంకేతిక సహాదారులుగా పనిచేశారు.
3) బి. రామకృష్ణారెడ్డి: గిరిజనుల భాషల పరిరక్షణ పరిశోధన కై దండకారణంలో కువీ, కుయి, ముండా, పెంగో భాషల పరిరక్షణకు కృషి చేశారు. తెలుగు భాషా శాస్త్ర అధ్యయనానికి లభించిన గౌరవం. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ గాపని చేశారు.
తెలుగు వారైనా ఆంధ్రప్రదేశ్ వారికి 2023లో లభించిన పద్మశ్రీ అవార్డులు 1.కీరవాణి- సంగీతానికి 2.ప్రకాష్ చంద్ర సూట్- సత్యసాయి విశ్వవిద్యాలయం పుట్టపర్తిలో పరిశోధన కృషికి
3.సి వి రాజు- హస్తకళలకు గతించిపోతున్ననటువంటి హస్త కళల కాపాడే విశేష కృషి చేసినందుకు
4. నాగేశ్వరరావు- సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో కృషికి
5. కోట సచ్చిదానంద శాస్త్రి- హరికథ విభాగంలో
6.ఖాదర్ వలీ- చిరుధాన్యాల నిపుణులు చిరుధాన్య లను మెలుకువలు, చిరుధాన్యాల పరిరక్షణ ఒక డాక్టర్ చంద్రశేఖర్ 7.డా.చంద్రశేఖర్ సంకురాత్రి- విద్యారంగంలో చేసిన కృషి పద్మశ్రీ లభించాయి.
2021సంవత్సరం లో కనక రాజుకి పద్మశ్రీ ఆదిలాబాద్ జిల్లా ఆదివాసి గుస్సాడి నృత్యానికి 55 సంవత్సరాల నుండి చేస్తున్న కృషికి లభించింది.
2022 సంవత్సరంలో దర్పనాల మొగిలయ్య పద్మశ్రీ తెలంగాణ ప్రాచీన పన్నేండు కిన్నెర వాయిద్యం వాయిస్తూ కళ రూపాన్ని కాపాడుతున్నారు. ఎనిమిద తరగతి సాంఘీక శాస్త్రం పుస్తకం లో పాఠ్యంశముగా చేర్చబడింది.
డా.తూము విజయ్ కుమార్, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, చరవాణి 9492700653.