గురుకుల టీచర్ పోస్టింగ్ లో అవకతవకలు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 25: హైదరాబాద్ బేగంపేటలోని ప్రజా భవన్‌లో గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన తెలిపారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వందలాది మంది అభ్యర్థులు ఈరోజు ఉదయం ప్రజా భవన్ కు చేరుకున్నారు. గురుకుల టీచర్ల పోస్టింగుల్లో నియమ నిబంధనలు పాటించలేదని ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు.

రూల్స్ పాటించక పోవడంతో భారీగా బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్ష రాసి అర్హత ఉన్నా ఉద్యోగాలు రాలేదని చెప్పారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకులాల్లోని ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను అర్హులైన అభ్యర్థులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment