మీరు చెల్లించే ప్రతి రూపాయికి సరియైన ప్రతిఫలం పొందండి..!!
భారత ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) ఒక యాప్…
వినియోగదారులారా తస్మాత్ జాగ్రత్త!!
ప్రియమైన వినియోగదారులకు దీపావళి శుభాకాంక్షలు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 25: వినియోగదారులారా తస్మాత్ జాగ్రత్త, మీరు చెల్లించే ప్రతి రూపాయికి సరియైన ప్రతిఫలం పొందండి. ప్రియమైన వినియోగదారులకు దీపావళి శుభాకాంక్షలు. పండగల సీజన్ లో వినియోగదారులు బంగారు నగలు, గృహోపకరణాలు, ఈ దీపావళి సందర్భంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులు వినియోగదారులను ఆకర్షించడం కోసం డిస్కౌంట్స్, ఫ్రీ గిఫ్ట్స్ ప్రకటిస్తూ ఉంటారు. అంతే కాకుండా వారి వద్ద నిల్వ ఉండే వస్తువులు సరుకులు విక్రయించుకోవడానికి సరైన సమయం ఇదే.
అందుకు వినియోగదారులు ఎంతైనా జాగ్రత్త పడ వలసినటువంటి అవసరం ఉంది. కొనుగోలు చేసిన తర్వాత మోసపోవడం కంటే మోసపోకుండా ఉండడం ఎలా?
అందుకు గృహోపకరణాలు, బంగారు నగలను మనము పరీక్షించుకునే విధంగా భారత ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) ఒక యాప్ రూపొందించడం జరిగింది. మొబైల్ ఫోన్లో ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని గృహోపకరణాలకైతే ఐ.ఎస్.ఐ. మార్క్ పై ఉన్నటువంటి ఐ.ఎస్.ఐ. మార్క్ నంబర్ను మన మొబైల్ ఫోన్లో చెక్ చేసుకునే అవకాశం కల్పించింది. అదే విధంగా బంగారు నగలు అయితే నాణ్యమైన బంగారు నగల పైన హాల్ మార్క్ తో పాటు హెచ్.యు.డి. నెంబర్ను పరీక్షించి ముద్రించి ఉన్నారు. ఆ నెంబర్ను తనికి చేసుకొని కొనుగోలు చేస్తే నూటికి నూరు శాతం వినియోగదారులు నాణ్యమైన సరుకులతో పాటు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంది.
పై విధానాలను మీరు ప్రతి వినియోగదారుడు తెలుసుకొని ఇతర వినియోగదారులకు తెలియపరచాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య(CATCO) అధ్యక్షులు, శంకర్ లాల్ చౌరసియా ప్రకటనలో తెలిపారు.