తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ నేడు ఖమ్మం జిల్లాలోని భద్రాద్రిలో పర్యటించనున్నారు.
హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ అక్టోబర్ 25: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ నేడు ఖమ్మం జిల్లాలోని భద్రాద్రిలో పర్యటించనున్నారు. ఈరోజు భద్రాచలంలోని సీతారామ చంద్ర దేవస్థానాన్ని సందర్శించి ఆలయంంలో ప్రత్యేకించి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కవులు, కళాకారులతో కూడా ఆయన సమావేశం కానున్నారు.
సీతారామ స్వామిని దర్శించుకుని నిన్ననే భద్రాచలం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు అధికారులు స్వాగతం పలికారు. ఆయన రాత్రి అక్కడే బస చేశారు. రాత్రికి బూర్గం పాడు మండలంలోని సారపాక లోని ఐటీసీ అతిధి గృహంలో బస చేసిన గవర్నర్ ఈరోజు ఉదయం భద్రాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం కానున్నారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.