డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ ఆధార్ కార్డు కాదు: సుప్రీం కోర్టు

Get real time updates directly on you device, subscribe now.

ఇక నుండి డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ ఆధార్ కార్డు కాదు: సుప్రీంకోర్టు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 25: ఒక వ్యక్తి వయస్సు నిర్ధారణకు స్కూల్ సర్టిఫికెట్ ను ప్రామాణికంగా తీసుకోవాలని, సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయానికి రాకూడదని పేర్కొంది. పదవ తరగతి ధ్రువీకరణ పత్రాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ఆధార్ కార్డు ఆధారంగా నిర్ణయానికి రాకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి పరిహారం చెల్లించేందుకు ఆధార్ కార్డును ఆమోదించిన పంజాబ్- హర్యానా హైకోర్టు ఆదేశాలను సుప్రీం కోర్టు గురువారం రద్దు చేసింది.

జువైనల్ జస్టిస్ పిల్లల సంరక్షణ – రక్షణ చట్టం, 2015 లోని సెక్షన్ 94 ప్రకారం స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్‌లో పేర్కొన్న పుట్టిన తేదీ నుండి మరణించిన వారి వయస్సును నిర్ణయించాలని న్యాయ మూర్తులు సంజయ్ కరోల్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

విశిష్ట గుర్తింపు అథారిటీ ఆఫ్ ఇండియా, దాని సర్క్యులర్ నం. 8/2023 ప్రకారం, డిసెంబర్ 20, 2018 నాటి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆఫీస్ మెమోరాండంకు సంబంధించి ఒక ఆధార్‌ను పేర్కొన్నట్లు మేము గుర్తించాం.

ఆధార్ కార్డ్ ను వయస్సు నిర్ధారణ పత్రంగా భావించరాదని పేర్కొన్న విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. హక్కు దారు-అప్పీలెంట్ల వాదనను అంగీకరించింది ధర్మాసనం. అతని స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ఆధారంగా మరణించిన వ్యక్తి వయస్సును లెక్కించిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) నిర్ణయాన్ని సమర్థించింది.

మృతుడి ఆధార్ కార్డుపై ఆధారపడి హైకోర్టు అతని వయస్సు 47 సంవత్సరాలుగా అంచనా వేసింది. పాఠశాల లీవింగ్ సర్టిఫికేట్ ప్రకారం అతని వయస్సును లెక్కించి నట్లయితే, మరణించే సమయానికి అతని వయస్సు 45 సంవత్సరాలు కాబట్టి ఆధార్ కార్డు ఆధారంగా మరణించిన వ్యక్తి వయస్సును నిర్ణయించడంలో హైకోర్టు పొరపాటు చేసిందని, ఈ సందర్భంగా గుర్తు చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment