బీఎస్ఎన్ఎల్ లోగో మార్పు..BSNL లోగో మారిందా..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 23: భారతీయ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరింత పాపుల్‌ అవుతోంది. గతంలో వెలుగు వెలిగి ఒక్కసారిగా పడిపోయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పుడు ఒక్కసారిగా లేచింది.

ప్రైవేట్‌ టెలికాం సంస్థలు అయిన రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల టారీఫ్‌ ప్లాన్స్‌ పెంచడమే. ఈ సంస్థలు రీఛార్జ్‌ ధరలు పెంచినా బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఎలాంటి ధరలు పెంచలేదు.


దీంతో చాలా మంది వినియోగదారులు తమ నంబర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ పెట్టుకుంటున్నారు. దేశంలో సొంత టెక్నాలజీతో 4జీ సేవలు అందుంబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

అంతేకాదు 5జీని కూడా వచ్చే ఏడాదిలో దేశ వ్యాప్తంగా అమలు అయ్యేలా పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ లోగోలో మార్పులు చేసింది.

కొత్తగా 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న కంపెనీ లోగోలో రంగుల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలోని ఎంపిక చేసిన సర్కిల్స్‌లో 4 సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా 4జీ సేవలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. లోగోలో కాషాయం, తెలుపు, గ్రీన్‌ కలర్స్‌తో లోగోను రూపొందించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment