ఆర్టీఐ కమిటీ ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ /అక్టోబర్ 22: మంగళవారం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో కొమరం భీమ్ జయంతి వేడుకల వారోత్సవాలను ఘనంగా నిర్వహించామని ఆర్టీఐ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేశ్ కుమార్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కొమరం భీమ్ ఆశయ సాధనలో మేము సైతం అంటూ పోరాట యోధుని ఆదర్శప్రాయుడైన కొమరం భీమ్ జయంతి వారోత్సవాలను ఘనంగా నిజామాబాద్ జిల్లాలోని అమరవీరుల పార్కులో  కొమరం భీంమ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కొమరం భీం ఆశయ సాధనలో స్ఫూర్తిని గుర్తు చేస్తూ జల్ జంగల్ జమీన్ పోరాట పటిమను స్మరిస్తూ ఆదివాసి హక్కుల కోసం అలుపెరగని యోధుడు కొమరం భీమ్ జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ పోరాటం కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి అటవీక జాతుల్లో చైతన్యాన్ని రగిలించి ఉద్యమ స్ఫూర్తిని దశ దిశల వ్యాప్తి చేసి ఆదివాసి గిరిజనుల పోరాట పటిమను చరిత్రను ఆటవిక ప్రపంచం నుండి ఆధునిక ప్రపంచం వరకు అన్ని రంగాలకు విస్తరించిన జల్ జంగల్ జమీన్ ప్రకృతి పర్యావరణ ప్రేమికుడిగా భూ పోరాట ఉద్యమాలకు ఆద్యుడుగా నిలిచారు ఆదివాసి గిరిజనుల అణిచివేతను అక్రమ కేసులను  ఎదుర్కొంటూ ఎన్నో పోరాటాలను చేస్తూ ఇప్పటికీ ఆటవిక తెగలంటూ సామాజిక రాజకీయ ఆర్థిక విధానాలకు వెనుకవేస్తూ వెనుకబడిన ఆదివాసి గిరిజనులకు ఇకనైనా స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కలిగించే విధంగా ప్రయత్నం చేయాలి. ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసిన కొందరు నాయకులు పై  అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారు. అట్రాసిటీ చట్టాన్ని నీరు కారుస్తూ బాధితులైన ఆదివాసులకు తక్షణ న్యాయ సహాయం కూడా అందడం లేదు. ఆదివాసులపై దౌర్జన్యలు దాడులలో బలైన బాధితులకు ఆర్థిక ప్రోత్సాహం గానీ భూ పంపిణీ గానీ ఉద్యోగ ఉపాధి భద్రత గాని ఎటువంటి కార్యక్రమాలను అందించడం లేదు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన పరిష్కారంలో జాప్యం చేయడం ఇటువంటి చర్యలను తక్షణమే పరిష్కరించి న్యాయ సాయం అందే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఆదివాసులకు పోడు పట్టాలు ఇవ్వాలని వ్యవసాయ పోడు గిరిజన భూములకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాలు ప్రతి గిరిజనుడికి అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని గతంలో మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం గద్దెదించి ప్రజా ప్రభుత్వానికి ప్రభుత్వానికి పట్టం కట్టిన ఆదివాసి గిరిజనులకు  రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే పోడు భూముల పట్టాలను మంజూరు చేసే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆదివాసి గిరిజనులకు డబల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిటీ సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ సభ్యులు, స్ఫూర్తి సేవ సొసైటీ సభ్యులు, అచ్చాన్నగారి రాజన్న, సయ్యద్ ఖదీరుద్దీన్, చైతన్య సోషల్ వెల్ఫేర్ సొసైటీ, ఛైర్మెన్ కోఎడి నరసింహులు, కళ శ్రీనివాస్, శ్రీరామ్ గౌడ్, సిడుగు శేఖర్, కట్టా నరేశ్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment