బ్రతికుండగానే స్మశాన వాటికలో మేనత్తను వదిలి వెళ్లిన మేనల్లుడు..
హ్యూమన్ రైట్స్ టుడే/రాజన్న సిరిసిల్ల జిల్లా/ అక్టోబర్ 22: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో కూకట్ల రాజవ్వ (70) అనే వృద్ధురాలిని బ్రతికుండగానే స్మశాన వాటికలోని వరండాలో వదిలి వెళ్లిన మేనల్లుడు కూకట్ల తిరుపతి.
ఆకలితో అలమటిస్తూ కొన ఊపిరితో ఉన్న వృద్ధురాలిని కాపాడిన సంబంధిత అధికారులు. వృద్ధురాలికి కొడుకులు, బిడ్డలు లేక పోవడంతో మేనల్లుడి ఇంటి వద్ద ఉంటున్న రాజవ్వ. మేనల్లుడు తిరుపతికి కౌన్సిలింగ్ ఇచ్చి వృద్ధురాలు రాజవ్వను తిరిగి ఇంటికి పంపించిన అధికారులు.