ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉద్యోగాలు నియమాకాలు వంద శాతం ఆదివాసులకే కేటాయించాలి –
ఆదివాసీ సంక్షేమ పరిషత్ (Asp)డివిజన్ కమిటీ డిమాండ్.
హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /అల్లూరి సీతా రామరాజు జిల్లా/ కూనవరం మండలం/ అక్టోబర్ 22: కోండ్రాజుపేట గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్విహించడం జరిగింది. భారత రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన 1/70 చట్టం పీసా చట్టం హాక్కులను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమౌతుంది. ఈ సందర్బంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ డివిజన్ అద్యక్షులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతాలో ఆర్టికల్ 244(1,) పేరా 4 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు నియామకాలు ఆదివాసీ అభ్యర్దులతోనే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్ డి ఎ రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం పీసా చట్టాలు ఉన్న జీ ఓ నెంబర్ 3 కీ వ్యతిరేకంగా మైదానం ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉద్యోగాలు ఎలా ఇస్తారని మండిపడ్డారు. DSC టీచర్ ఉద్యోగాలు వందకు వంద శాతం స్థానిక ఆదివాసులతోనే భర్తీ చేయాలి. ఆదివాసులకు అన్యాయం చేస్తే ఉద్యమాల బాట పడతమని అన్నారు.