ఏపీకి ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో హైకోర్టు బెంచ్ : సీఎం చంద్రబాబు
హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/అమరావతి/ప్రతినిధి/అక్టోబర్ 22: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని, అదే మనందరి ఏకైక రాజధాని అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమరావతి కోసం 54 వేల ఎకరాలు సేకరిస్తే గత ప్రభుత్వం రాజధానిని నాశనం చేసిందని దుయ్య బట్టారు. రైతులను అడుగడుగునా అణగ దొక్కినా వాళ్లు అద్భుతంగా పోరాడారని సీఎం చంద్రబాబు తెలిపారు.