తెలంగాణలో విద్యుత్ సేవల కోసం ప్రత్యేక విద్యుత్ వాహనాలు…!
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 21: ప్రజలకు విద్యుత్ సేవలు అందిచేందుకు దేశంలోనే తొలిసారి అంబులెన్స్ తరహాలోనే ప్రత్యేక విద్యుత్ వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం GHMC పరిధిలోని 57 సబ్ డివిజన్ లకు 57 వాహనాలను కేటాయిస్తూ డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వాహనాలను ప్రారంభించారు.
ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్
మెన్లు మరియు అవసరమైన మెటీరియల్ తో సేవలు అందించేందుకు 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు.