నకిలీ విజిలెన్స్ లా దందా ముఠా అరెస్ట్ చేసిన పోలీసులు

Get real time updates directly on you device, subscribe now.

నకిలీ ఐడి కార్డులు పెట్టుకున్న దుండగులు…

5 గురు దుండగులు రూ. 2,50,000/- డిమాండ్ చేసిన వైనం..

వారి వద్ద ఉన్న ఫార్చునర్ కారు, 7 సెల్ ఫోన్లు, రూ.10వేల నగదు స్వాధీనం..

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…

కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్…

హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /కర్నూలు
ఓర్వకల్/న్యూస్ ప్రతినిధి/అక్టోబర్ 20: నకిలీ విజిలెన్స్ లా ముఠాను శుక్రవారం రాత్రి నన్నూరు సమీపంలో రాకమయూరి దగ్గర అరెస్టు చేసి పట్టుకున్నట్లు కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ వెల్లడించారు. నన్నూరు గ్రామం రాగమయురికి చెందిన  బెస్త గంగాధర్ వారి వద్ద పనిచేస్తున్న పింజారి పెద్ద దర్గాయాలను నేషనల్ క్రైమ్, నేషనల్ ఇన్విటిగేషన్, హ్యూమన్ రైట్స్ అని చెప్పి ఫార్చునర్ కార్ కి బోర్డులు వేసుకొని మీరు బియ్యం వ్యాపారం చేస్తున్నారని బెదిరించి దుండగులు 2,50,000 డిమాండ్ చేయగా ఫిర్యాదుదారులు ఇచ్చిన సమాచారం రూరల్ సీఐ  చంద్రబాబు నాయుడు ఓర్వకల్ ఎస్సై సునీల్ కుమార్ కలిసి 5 మందిని 1. పాలికట్టి మధుసూదన్ 2. శీలం అంకిరెడ్డి 3. పరదేవీ రవికుమార్ 4. కొరతల మహేష్ 5. ఆవుల మధులను పట్టుకుని వారి వద్ద ఫార్చునర్ వాహనం సెల్ ఫోన్లో 10,000 నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ సందర్భంగా కర్నూల్ డిఎస్పి బాబు ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలను ఇలాంటి మోస పోకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వారి వద్ద ఉన్న నగదు సెల్ఫోన్లో స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి రిమాండ్ పంపిస్తున్నట్లు డిఎస్పి తెలిపారు.  ఈ కార్యక్రమంలో తమ విధినిర్వహలో భాగంగా పాల్గొన్న పోలీసులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment