హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/తూర్పుగోదావరి జిల్లా/కోరుకొండ/ప్రతినిధి/అక్టోబర్ 20: తెలుగుదేశం పార్టీ కూటమి తరుపున పోటీచేసే ఉపాధ్యాయ, పట్టభద్రులు శాసనమండలి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలలు కాంట్రాక్టు ఉద్యోగుల ఫెడరేషన్ (APGCEF) సంపూర్ణ మద్దత్తు ప్రకటించిందని రాష్ట్ర చెర్మన్ రౌతు గోపి, జోనల్ కన్వీనర్ డా. వొలుపు కనకరాజు తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2025 మార్చి నెలలో జరగనున్న గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మొత్తం 4 శాసన మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన కూటమి ప్రకటించిన అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, ప్రభుత్వానికి బాసటగా నిలవాలన్నారు. ఆంధ్రరాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, కేజీబీవీ
మోడల్ స్కూల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మహత్మా జ్యోతిరావ్ పూలే రెసిడెన్సియల్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు, యూనివర్శిటీలు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలలు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు తదితర ప్రభుత్వ విద్యా సంస్థల్లో పని చేస్తున్న అధ్యాపకులు, ఉపాధ్యాయులు అందరూ
విధిగా ఓటు నమోదు చేసుకుని, మిగిలిన వారితో కూడా పెద్దఎత్తున నమోదు చేయించి తెలుగు దేశం కూటమి పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని కనకరాజు తెలియజేశారు. వివిధ ప్రభుత్వ జూనియర్ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరు పసుపు రిబ్బన్లు దుస్తులకు ధరించి విధులకు హాజరై భోజనం విరామ సమయంలో కళాశాలలోని ఉపాధ్యాయులందరూ మానవహారం నిర్వహించి తెలుగుదేశం కూటమి అభ్యర్థులకు ప్రభుత్వానికి తమ సంఘీభావాన్ని తెలియజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 114 వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కొరకు చేసిన చట్టం (యాక్ట్ 30/2023) తక్షణమే అమలు పరిచి అందులో ఉన్న లోపాలను సవరించి ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాలలో పని చేస్తున్న వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు సంఘీభావం తెలియజేస్తున్నట్లు వివరించారు.