హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ /ఎన్టీఆర్ జిల్లా/విజయవాడ/ అక్టోబర్ 20: ఏపీ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున 84,297 క్యూసెక్కుల వరదలు నీరు రావడంతో బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో 12 అడుగుల నీటి మట్టం ఉంది. 3.07 టీఎంసీల నీరు నిల్వ ఉన్నాయి.