జర్నలిస్టుల హక్కుల సాధనలో డిజెఎఫ్‌ది అలుపెరగని పోరాటం….
ఫిబ్రరి 5న కరీంనగర్‌లో డిజెఎఫ్ జర్నలిస్టుల జాతీయ మహాసభ….
వివిధ రాష్ట్రాల నుంచి హాజరుకానున్న జర్నలిస్టులు
ఉత్తమ పాత్రికేయ అవార్డుల ప్రదానంతోపాటు సీనియర్ పాత్రికేయులకు సన్మానం…
సభకు పాత్రికేయులంతా తరలిరావాలని డిజెఎఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు పి.విశ్వనాథ్ పిలుపు…
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
జర్నలిస్టుల హక్కుల సాధనలో డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్( డిజెఎఫ్) అలుపెరగని పోరాటం చేస్తోందని డిజెఎఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు పి.విశ్వనాథ్ అన్నారు. డిజెఎఫ్ ఆవిర్భావం తర్వాతనే డిజిటల్ మీడియాకు సరైన గుర్తింపు దక్కుతోందన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని డిజెఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్టులు లేదంటే కాదని కొన్నివర్గాలు చేసిన దుష్ప్రచారాన్ని డిజెఎఫ్ విజయవంతంగా తిప్పికొట్టిందన్నారు. నిఖార్సయిన జర్నలిజానికి అక్రిడేషన్‌తో ఎటువంటి సంబంధం లేదని ఈ విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు.అక్షరానికి వివక్షత లేదని, చిన్న పెద్ద తారతమ్యం లేదని వర్కింగ్ జర్నలిస్టులందరికీ అన్ని ప్రభుత్వ రాయితీలు, సంక్షేమ ఫలాలు అందాలన్నారు. ఆ దిశగా అటు ప్రభుత్వం ఇటు తోటి పాత్రికేయ సంఘాలు పనిచేయాలన్నారు. చిన్న మీడియాలు, డిజిటల్ మీడియాలు, అక్రిడేషన్లు అంటూ వివక్షత కనబర్చిన పరిస్థితుల్లో డిజెఎఫ్ గట్టిగా పోరాటాలు చేయడంతో నేడు ఆయా మీడియాల్లో పనిచేస్తున్నవారందరికీ సరైనగుర్తింపుదక్కుతోందన్నారు. ఇదంతా డిజెఎఫ్ సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు.