మధ్యం సేవించిన వ్యక్తి డ్రైవింగ్ చేయడం పై సెక్షన్ 185 క్రింద మొదటి సారి నేరం

Get real time updates directly on you device, subscribe now.

పత్రికా ప్రకటన – హ్యూమన్ రైట్స్ టుడే/ అమరావతి /చిత్తూరు/అక్టోబర్ 19:

మద్యం మత్తులో వాహనం నడిపితే, గమ్యం నేరుగా అకాల మరణం అవుతుంది. మీ కుటుంబం కోసం మీ ప్రాణాలను కాపాడుకోండి, బాధ్యతగా ఉండండి : ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నిత్యబాబు.

మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మందికి 10,000 చొప్పున 1,30,000/- రూ. మరియు రెండవ సారి మద్యం తాగి వాహనం నడిపిన 1 వ్యక్తికి 15,000 రూ. మొత్తం 1,45,000/- రూ. జరిమానా విధింపు.

చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్ మణికంఠ చందోలు, ఐపీఎస్ ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి.సాయినాథ్ ఆద్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నిత్య బాబు నిన్నటి దినం వాహన తనిఖీ చేస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 14 మంది పట్టుబడ్డారు.

వీరిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో ఈ రోజు ఉదయం ప్రవేశపెట్టగా జడ్జ్ శ్రీమతి ఉమా దేవి వాహనదారులకు 13 మందికి ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున మొత్తం 1,30,000/- రూ.లు మరియు రెండవ సారి మద్యం తాగి వాహనం నడిపిన 1 వ్యక్తికి 15,000 రూ.లు మొత్తం 1,45,000/- రూ. జరిమానా ఫైన్ విధించడం జరిగింది.

ఈ 10 నెలల వ్యవధిలో చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన 424 మందికి సుమారు 42.5 లక్షల రూపాయల ఫైన్ విధించడం జరిగింది.

రోడ్డు భద్రత నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, జిల్లాలోని ప్రతి ఒక్కరు రోడ్డు నియమాలను తప్పక పాటించాలని లేదా భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నిత్యబాబు తెలిపారు. మద్యం తాగి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరం, ఇది మీ ప్రాణాలకు, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తుంది.

మధ్యం సేవించిన వ్యక్తి డ్రైవింగ్ చేయడం పై సెక్షన్ 185 క్రింద మొదటి సారి నేరం చేస్తే రూ. 10,000/- జరిమానా, లేదా 6 నెలల జైలు శిక్ష, లేదా రెండును విధించవచ్చు, రెండవ సారి నేరం చేస్తే రూ.15,000/- లేదా 3 సం.ల జైలు శిక్ష, లేదా రెండును విధించవచ్చునని కావున వాహనం నడిపే సమయంలో వాహనదారులు రోడ్డు భద్రతా మరియు రహదారి నిభందనలు తప్పక పాటించి ప్రమాదాలు, జరిమానాలు, శిక్షలకు గురి కాకుండా ఉండాలని ఇన్స్పెక్టర్ కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment