హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
మిత్రులారా..మూడు నెలల క్రితం జరగాల్సిన డిజెఎఫ్ మహాసభ అనివార్యకారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ సభను వచ్చేనెల ఫిబ్రరి 5న (ఆదివారం..05.02.2023) కరీంనగర్ పట్టణంలో నిర్వహించడానికి డిజెఎఫ్ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి డిజెఎఫ్ సభ్యులందరూ హాజరుకావల్సిందిగా పేరుపేరునా ఆహ్వానం. ఈ సభలో ఉత్తమ జర్నలిస్టుల అవార్డుల ప్రదానం, డిజెఎఫ్ జాతీయ డైరీ ఆవిష్కరణ, సభ్యులకు ఉచిత ఇన్సూనెర్స్ సౌకర్యం కల్పించడంతోపాటు వివిధ రకాల కార్యక్రమాల నిర్వహన ఉంటుంది. అదేవిధంగా డిజెఎఫ్ విధివిధానాలు, రానున్న రోజుల్లో డిజెఎఫ్ కార్యాచరణ వంటి అంశాలన్ని చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది.అందుకే మిత్రులారా..డిజెఎఫ్‌లో వివిధ కమిటీల్లో ఉన్నవారు..ఉండాలనుకునేవారు..ఉన్నత పదవుల్లో చేరాలనుకునేవారంతా ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాల్సిందిగా పేరుపేరునా విజ్ఞప్తి.
అభినందనలతో
పి.విశ్వనాథ్
డిజెఎఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు