హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ /అక్టోబర్ 19: బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టంలోని రెండు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమంటూ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం తిరగదోడింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు ఆ తీర్పుపై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం సమీక్షకు అనుమతించింది. బినామీ ఆస్తుల లావాదేవీల నిషేధ చట్టం-1988 సవరించని నిబంధనల్లోని సెక్షన్లు 3 (2), 5 రాజ్యాంగ విరుద్ధమని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం 2022 ఆగస్టులో తీర్పునిచ్చింది. అయితే ఆ నిబంధనల చెల్లుబాటును కోర్టులో ఎవరూ సవాల్ చేయలేదని తీర్పును సమీక్షించాల్సిన అవసరముందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాజాగా కోర్టు దృష్టికి తెచ్చారు.