ఓయూ ఇన్స్పెక్టర్ పై టాలీవుడ్ నిర్మాత దాడి..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 18: ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఓ నిర్మాత హల్చల్ చేశారు. ఓ కేసు విషయమై నిర్మాత‎ను ఓయూ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ పిలిచారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు నిర్మాత నన్నే పోలీస్ స్టేషన్‎ కు పిలుస్తావా అంటూ పీఎస్‎ కు వెళ్లి ఇన్స్పెక్టర్‎ పై దాడికి దిగారు. నిర్మాతతో పాటు వచ్చిన అతడి అనుచరులు కూడా ఇన్స్పెక్టర్‎ పై దాడి చేశారు. నిర్మాత, అతడి అనుచరులు హంగమా చేయడంతో ఓయూ పోలీస్ స్టేషన్‎ లో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఇన్స్పెక్టర్‎ పై దాడి సమాచారం అందుకున్న సీనియర్ పోలీస్ అధికారులు హుటాహుటిన ఓయూ స్టేషన్‎ కు చేరుకున్నారు. ఇన్స్పెక్టర్‎ పై దాడి  ఘటనపై ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment