వైన్ షాప్ లోచ్చిన వారిని బెదిరిస్తున్న EXCISE అధికారులు..!
హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/అక్టోబర్ 17: వైన్ షాప్ లోచ్చిన వారిని బెదిరిస్తున్న EXCISE అధికారులు! మీ వ్యాపారం ఆరు “ఫుల్ ” మూడు “ఆప్” లుగా కొనసాగాలంటే, కూటమి ముఖ్య నేతల ఆశీస్సులు, అందండలు ఉంటేనే సాధ్య పడుతుందని కొత్తగా వైన్ షాప్ లోచ్చిన, వారిని, EXCISE అధికారులు పిలిపించి చెబుతున్నారట. ఎమ్మెల్యేలను, మంత్రులను కలవమని, లేకుంటే మీకు చాలా నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారట వారు అధికారపార్టీ ఎమ్మెల్యేలు వారిని కలిసి మాట్లాడుకోండి. లేదంటే మీకు ఇబ్బందులు ఎదురవ్వుతాయి. మీ ఇష్టం అని పరోక్షంగా బెదిరిస్తున్నారట లాటరీ పద్ధతి ద్వారా వైన్ షాప్ లోచ్చిన వారిలో, ఎక్కువ మంది వైసిపి సానుభూతి పరులే ఉండటంతో, అధికార ఎమ్మెల్యేలు, మంత్రులుకు, ఆర్థికంగా కలిసి రాబోతుందట. సొంత వారిని ఎక్కువ డిమాండ్ చేయలేము వైసిపి పార్టీ వారిని బయపెట్టవచ్చు, బెదిరించవచ్చు అని వారి నమ్మకం. కొన్ని జిల్లాలలో, లాటరీ పద్ధతి ద్వారా కూడా, సిండిగేట్ గా ఏర్పడిన వారికి బాగా కలిచొచ్చింది. వైన్ షాప్ లు ఎవ్వరికీ వచ్చినా, అధికారం పంట పండబోతుంది.. వాటలు, భాగస్వామ్యాల ఒప్పందాలు కూడా కుదురుతున్నాయట. ముందు ముందు లిక్కర్ వ్యాపారాలు, అధికారం ప్రతినిధులకు, అదనంగా, ఆర్థికంగా ఎంతెంత లబ్ది చేకూరనుందో ????