హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/స్పోర్ట్స్/అక్టోబర్ 17: కుప్పకూలిన భారత్.. 46 పరుగులకే ఆలౌట్..
బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కుప్పకూలింది. కేవలం 46 పరుగులకే ఆలౌట్ అయింది. పంత్ 20, జైస్వాల్ 13 మినహా మిగిలిన బ్యాటర్లు కనీసం రెండంకెల స్కోర్ చేయలేదు. రోహిత్ 2, కోహ్లీ 0, సర్ఫరాజ్ 0, కేఎల్ రాహుల్ 0, జడేజా 0, అశ్విన్ 0, కుల్దీప్ 2, బుమ్రా 1, సిరాజ్ 4 దారుణంగా విఫలమయ్యారు. టీమిండియాలో మొత్తంగా ఐదుగురు డకౌట్ అయ్యారు.