తాత్కాలిక డీజీపీల నియామకంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
నిబంధనలకు విరుద్దంగా డీజీపీలను నియమిచడంపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట ప్రభుత్వాలకు కోర్టు ధిక్కరణ కింద నోటీసులు జారీ చేసింది..
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/లీగల్/అక్టోబర్ 16:
ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, యూపీ ప్రభుత్వాలు నిబంధనలకు విరుద్ధంగా తాత్కాలిక డీజీపీలను నియమించాయని హరియాణకు చెందిన వినోద్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
డీజీపీ పోస్టు భర్తీకి మూడు నెలల ముందే ఆరు నెలల సర్వీసు ఉన్న సీనియర్ డీజీ ర్యాంకు అధికారుల జాబితాను యూపీఎస్సీ చైర్మన్ అధ్యక్షతన ఒక కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం పేర్లను పంపించాల్సి ఉంటుందని తెలిపారు. కానీ, ఇలా జరగలేదని, ఈ రాష్ట్రాల్లో సుప్రీం తీర్పునకు విరుద్దంగా అడ్‌హక్ డీజీపీలను నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో మెరిట్, సీనియరిటీ ఆధారంగా ముగ్గురు పేర్లను ఖరారు చేసి ప్రభుత్వానికి పంపితే ప్రభుత్వం ఆ ముగ్గురిలో ఒకరిని డీజీపీగా నియమించాలనే నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పుడు ఈ ఎనిమిది రాష్ట్రాలు అందుకు విరుద్ధంగా ప్రవర్తించాయని ధర్మాసనానికి వివరించారు.
ఈ సందర్భంగా ఈనెల 21వ తేదీ లోపు మీ వైఖరి చెప్పాలంటూ 8 రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీచేసింది.