ఏ-4 గా ఉన్న నేను ఆరేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా..

Get real time updates directly on you device, subscribe now.

రేవంత్ రెడ్డి కోర్టుకు రాకపోతే నిరాహారదీక్ష చేస్తానని జెరూసలేం మత్తయ్య డిమాండ్‌

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఏ-1.

ఏ-4 గా ఉన్న నేను ఆరేండ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నా.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 16: రేవంత్‌రెడ్డి హాజరైతే ట్రయల్‌ స్టార్ట్‌ చేస్తానని ఈడీ కోర్టు న్యాయమూర్తి చెప్పారు. అందుకే ఒకసారి కోర్టు విచారణకు హాజరుకావాలని విజ్ఞప్తి చేస్తున్నా.

ఓటుకు నోటు కేసులోని ముఖ్యులైన రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడులు ముఖ్యమంత్రులు అయ్యారు. వేం నరేందర్‌రెడ్డి తెలంగాణ సీఎంవో ముఖ్య సలహాదారుగా, ఉదయ్‌ సింహ ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పదవిలో ఉన్నారు.

మధ్యలో నేను ఎటు కాకుండా పోయాను. రేవంత్‌రెడ్డి తన స్నేహితుడైన వేం నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పోస్టు ఇప్పించుకోవడానికి నన్ను బలి చేశాడు.

రేవంత్‌ రెడ్డి కోర్టు కొచ్చి నిజాలు చెప్పి న్యాయస్థానాన్ని గౌరవించాలి. లేనిపక్షంలో ఇప్పటివరకు రేవంత్‌ రెడ్డి ఈ కేసులో ఆధారాలు ఎక్కడెక్కడ చెరిపివేశాడో తిరిగి నా దగ్గర ఉన్న నిజమైన అన్ని ప్రూఫ్‌లను కోర్టులకు, దర్యాప్తు సంస్థలకు ఇచ్చి తనతో సహా అందరికీ శిక్షపడేటట్టు చేస్తానని వార్నింగ్ ఇచ్చిన జెరూసలేం మత్తయ్య.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment