చిన్న వాగ్వాదం పెద్దదై రెండు ప్రాణాలు పోయి ఆ కుటుంబం సర్వం కోల్పోయింది..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/క్రైం/అక్టోబర్ 15: ముంబైకి చెందిన ఆకాష్ మీన్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య గర్భిణి. ఆకాష్ మీన్ తన తల్లిదండ్రులకు కారు గిప్ట్‌గా ఇద్దామని ముంబైకి వెళ్ళాడు. కారు డెలివరీ ఆలస్యం కావడంతో షోరూం నుండి ఆకాష్, గర్భిణీ అయిన తన భార్య బైక్‌పై రిటర్న్ అవ్వగా, ఆకాష్ తల్లిదండ్రులు ఆటోలో వెళ్లారు.
ఇంతలో ఆకాష్ బైక్ ముందు ఒక ఆటో వ్యక్తి స్పీడ్‌గా కట్ కొట్టగా, ఆకాష్ తన భార్య కిందపడబోయారు. దీంతో ఆకాష్ హరన్ కొట్టి ఆటో నడిపే వ్యక్తిని జాగ్రత్తగా నడపమని చెప్పాడు. ఇంతలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆటో డ్రైవర్ తన స్నేహితులకు ఫోన్ చేయగా 15 మంది వచ్చి ఆకాష్‌పై దాడి చేశారు.
ఆకాష్‌ను కాపాడుకోవడానికి అడ్డం వెళ్లిన భార్య, తల్లిదండ్రులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆకాష్ భార్య గర్భిణిపై కూడా దాడి చేయడంతో ఆమె కడుపులో ఉన్న చిన్నారి చనిపోయింది. ఆకాష్ తండ్రికి కన్ను పోగా, తల్లికి తీవ్రగాయాలయ్యాయి. చిన్న వాగ్వాదం పెద్దదై రెండు ప్రాణాలు పోయి ఆ కుటుంబం సర్వం కోల్పోయింది.
దేశంలో రోజు రోజుకి రోడ్డు రేజ్ సంఘటనలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద చిన్న విషయాలకు సంయమనం కోల్పోకండి. అవతలి వాళ్ళ మీద పైచేయి కోసం ప్రయత్నించకండి. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే వాహనం నెంబర్ రాసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఎప్పుడూ వాదనలకు, కొట్లాటకు దిగకండి.