రిజర్వేషన్ల ఎత్తివెత కుట్రలో భాగమే యస్సి వర్గీకరణ అంశమన్నా వక్తలు..
హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్ అక్టోబర్ 15: యస్సి వర్గీకరణను వ్యతిరేకస్తూ నగరంలోని పోచమ్మ గల్లీ యస్సి మాల సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించినట్లు ఆధ్యక్షా కార్యదర్శులు పులి జైపాల్, నీలగిరి చందు తెలిపారు.
యస్సి వర్గీకరణ వల్ల యస్సిల ఉనికి కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని వక్తలు అభిప్రాయం తెలిపారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యస్సిలను విభజించి పాలించాలని అట్టడుగు వర్గాల వారికీ రిజర్వేషన్ ఫలాలు అందించే మార్గాలను అన్వేశించాలసినది పోయి యస్సి కులాల మధ్య చిచ్చి పెట్టె విధంగా వ్యవహారిస్తున్నారని, యస్సి ఉప కులాలలో ఉన్న అపోహలను తొలగించి అందరికి రిజర్వేషన్ ఫలాలను అందించాలని విభజన ద్వారా విభజించి పాలించే వైఖరిని అవలంభించటం చాలా సిగ్గు చేటని అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ పరం చేస్తూ, ప్రైవేట్ యూనివర్సిటీ లను తీసుకు వస్తూ రిజర్వేషన్ల ఎత్తివెతకు తెరతీశారని, వర్గీకరణ ద్వారా క్రిమిలేయర్ ను ప్రవేశ పెట్టి పూర్తిగా రిజర్వేషన్లను రద్దు చేసే విధంగా కుట్ర పన్నుతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను ఒక సభ్య కమిటీ ఏర్పాటు చేసి 60 రోజుల వ్యవదిలో రిపోర్ట్ సమర్పించాలని కోరినందున వర్గీకరణకు మాలలు వ్యతిరేకంగా మంత్రి వర్గ ఉపసంఘానికి అభిప్రాయలు తెలపాలని అన్ని మాలల సంఘాలలో సమావేశాలు నిర్వహించి సంఘాల అభిప్రాయాలు పంపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పులి జైపాల్, ప్రధాన కార్యదర్శి నీలగిరి చందు, సభ్యులు తర్ల రమేష్, నిరంజన్ బక్కోళ్ల గంగాధర్, రాజ్, నాంది సుశీల్, నీలగిరి రాజు, ఎడ్ల శ్రవణ్, తర్ల రమేష్ (టీచర్), నాది సురేష్, గజ్జల రాజేశ్వర్, జంగం వివేక్, ఎడ్ల ఋషికేష్, జంగం శ్రీనివాస్, ఎడ్ల వినయ్, జంగం రాజు, వెల్మల లక్ష్మి, ఎడ్ల లావణ్య, వెల్మల రాధాబాయ్, ఆసది లోకేష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.