సర్టిఫికెట్ల కోసం కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని తహశీల్దార్‌ను నిలదీసిన యువతి..
సర్టిఫికెట్లు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని సర్టిఫికెట్లను ఇప్పించుకున్న యువతి..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 15:
గద్వాల – మానవపాడు తహశీల్దార్ వహీదాను ఓ యువతి నిలదీసింది.. నారాయణపురం గ్రామానికి చెందిన హైమావతి ఓబీసీ, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్లకు దరఖాస్తు చేసుకోగా.. గంటల పాటు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
సర్టిఫికెట్లు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని బైఠాయించింది.. దీంతో తహశీల్దార్ యువతిని సముదాయించి సర్టిఫికెట్లను జారీ చేసింది.