జిల్లా ఎస్పీనీ సత్కరించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్..

Get real time updates directly on you device, subscribe now.

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ ను ఘనంగా సత్కరించిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యులు.

హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/ గుంటూరు జిల్లా/ ప్రతినిధి/అక్టోబర్ 14: గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ ను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కొద్దిరోజుల క్రితం ఎస్పీ సతీష్ కు ప్రభుత్వం ఏ.డి.సి అవార్డు ఇచ్చిన సందర్భంలో ఎస్పీ సతీష్ కు అభినందనలు తెలియజేస్తూ సత్కరించారు. సంచలనాత్మక కొన్ని ప్రముఖ సంఘటనలలో త్వరితగతిన కేసులు చేదించిన సందర్భంలో ఎ.డి.సి అవార్డుకు ఎంపిక అవుతారని, గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కూడా పేద ప్రజల పట్ల జరిగిన అనేక నేరాలను చాలా శ్రద్ధతో చర్యలు తీసుకుంటూ జిల్లాకు వచ్చిన కొద్ది కాలంలోనే ప్రజల మన్ననలు పొందారు. ప్రజలు చెప్పింది చాలా ఓపిక గా విని తక్షణమే చర్యలు తీసుకోవడం ప్రజలకు ఎస్పీ సతీష్ యొక్క వైఖరి పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ సతీష్ పేద ప్రజల పట్ల చాలా శ్రద్ధ చూపిస్తున్నారని, గతంలో కన్నా ఇప్పుడు జరిగిన సంఘటనలు వెంటనే పరిష్కారం అవటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే గుంటూరు జిల్లా వ్యాప్తంగా తనదైన శైలిలో ముందుకు సాగుతున్న జిల్లా ఎస్పీ సతీష్ రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులతో పాటు అత్యున్నత హోదాలో అందరి మన్ననలు పొందాలని ఫెడరేషన్ సభ్యులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పట్నాల సాయి కుమార్, అజయ్ ఇండియన్, శామ్యూల్, వేముల రాజేష్, కొండవీటి పుల్లారావు, మహేష్ వరదల, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment