ఏపీలో న్యూ లిక్కర్ పాలసీ..ప్రారంభంలోనే రూ. 2400 కోట్ల ఆదాయం..
హ్యూమన్ రైట్స్ టుడే/ అమరావతి/అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపులకు జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించారు. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ.1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం సమకూరుతుంది.