హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 15: “గాంధీ గురించి ఇతరులకంటే నాకు బాగా తెలుసు. అతను తన కోరలు చూపించాడు, నేను అతని అంతరంగాన్ని చూసాను. గాంధీ జీవితం మొత్తం రెండు నాల్కల ధోరణి కనపర్చేవాడు. అతను ఇంగ్లీష్, గుజరాతి భాషల్లో పత్రికలు నడిపాడు. ఈ రెండు పత్రికలు చదివితేనే, ప్రజలను అతనెలా మోసాగించాడో తెలుసుకోవచ్చు. ఇంగ్లీష్ పత్రికలో తను కులానికి వ్యతిరేకిగా, అస్పృశ్యత కు వ్యతిరేకిగా, ప్రజా స్వామ్యవాదిగా కనిపించేందుకు ప్రయత్నిస్తాడు. అంతర్జాతీయ స్థాయిలో గొప్పవాడిగా నిలబడే ప్రయత్నం చేస్తాడు.
అదే సమయంలో గుజరాతి పత్రికలో కుల నిర్మూలనకు వ్యతిరేకిగా ప్రచారం చేసుకున్నాడు. కుల వ్యవస్థ మద్దతు దారుడి కనిపించడం ద్వారా హిందూ సనాతులను సంతృప్తి పర్చేందుకు ప్రయత్నిస్తాడు. ఏ కుల వ్యవస్థ అయితే భారతదేశ అభివృద్ధికి ఆటంకంగా ఉందో, అదే వ్యవస్థను స్థిర పరిచేందుకు కృషి చేశాడు.” – బాబాసాహెబ్ అంబేడ్కర్.
ఈవిధంగా రెండు నాల్కల ధోరణితో సమస్యలను పరిష్కరిస్తున్నట్లు నటిస్తూ జఠిలం చేయడం గాంధీ నైజం. అది అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్య అయినా అంతే, స్వాతంత్ర్య పోరాటమైనా అంతే. చివరికి ఆ రెండు నాల్కల ధోరణి కారణంగానే ఓ మతోన్మాది చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ముస్లింలు గాంధీని నమ్మారు. అతనో నమ్మక ద్రోహి అని తెలిస్తే వారైనా ఏదైనా చేసే వారేమో.
దళితులు గాంధీని కొంతమేర నమ్మినా ఎక్కువమంది అతనిలో వివక్షతల కోణాన్ని చూసారు. అయినా అతనిపై దాడులకు మాత్రం తెగ బడలేదు.
స్వాతంత్య్రం కోసం కూడా ఎప్పుడూ ఆమరణ నిరాహార దీక్ష చేయని గాంధీ దళితులకు రాజకీయ హక్కులకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం గాంధీ కులాధిపత్యానికి ఉదాహరణ. ఇంత చేసినా ఒక్క దళితుడు కూడా గాంధీపై చేయి చేసుకోలేదు, అది వేరే సంగతి.
సేకరణ & విశ్లేషణ:
శామ్యూల్ రాజ్