సోమవారం ప్రభుత్వ సెలవు కాదు..
ఉదయం కొద్దిసేపు ఓ పంచాయతీ కార్మికురాలు..
కొద్దిసేపటి తర్వాత గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం..
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/రుద్రూర్/అక్టోబర్ 14: దసరా పండుగ ముగిసింది, సోమవారం ప్రభుత్వ సెలవు దినం కాదు, అయినా నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం ఉంది. ఉదయం కొద్దిసేపు ఓ గ్రామ పంచాయతీ కార్మికురాలు వచ్చి తలుపులు తీసింది. ఒక్క సిబ్బంది కూడా గ్రామపంచాయతీ కార్యదర్శి కూడా హాజరు కాలేదు. ఒక కంప్యూటర్ ఆపరేటర్ తప్ప పంచాయతీ కార్మికురాలు తప్ప ఎవరూ లేరు. కొద్దిసేపటి తర్వాత గ్రామపంచాయతీ కార్యాలయనికి తాళం వేశారు. సెలవు దినం కానప్పటికీ గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేయడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనేకమంది పనుల కోసం వచ్చిన వారు తాళం ఉండడంతో వెన్ను తిరిగి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శికి చరవాణి ద్వారా వివరణ కోరగా అందరూ సెలవుల ఉన్నామని, సెలవు పెట్టామని సమాధానం ఇచ్చారు.