హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/అక్టోబర్ 14: భారత ప్రభుత్వ నోటరీగా దాసరి చిట్టిబాబు తిరిగి నియమితులయ్యారు. గత ఐదేళ్లుగా ఆయన నోటరీగా ఉన్న విషయం విదితమే. వీరి పనితీరును పరిగణలోకి తీసుకుని భారత ప్రభుత్వం మరో ఐదేళ్లపాటు ఆయనని నియమించింది. వీరు 2029 అక్టోబర్ వరకు నోటరీగా వుంటారు.
చిట్టిబాబు గతంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా పనిచేసారు. ప్రస్తుతం పలు బ్యాంకులకు న్యాయ సలహాదారునిగా పనిచేస్తున్నారు. వీరిని భారత ప్రభుత్వం నోటరీగా తిరిగి నియమించడం పట్ల పలువురు స్థానిక న్యాయవాధులు అభినందించారు. ఈ సందర్బంగా చిట్టిబాబు మాట్లాడుతూ పేదలకు న్యాయ సహాయం అందించటంతో పాటు నోటరీగా సేవలను అందించే అవకాశం రావడం అదృష్టం అన్నారు.