హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: తెలంగాణలో 41మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పంజాగుట్ట ఏసీపీ గణేశ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎస్.మోహన్‌కుమార్‌ను నియమించనున్నారు. అలాగే అబిడ్స్ ఏసీపీగా పూర్ణచందర్, మీర్ చౌక్ ఏసీపీగా దామోదర్‌రెడ్డి, సంతోష్‌నగర్ ఏసీపీగా మహమ్మద్ గౌస్, చార్మినార్ ఏసీపీగా రుద్ర భాస్కర్, మలక్‌పేట్ ఏసీపీగా శ్యామ్ సుందర్, కామారెడ్డి డీఎస్పీగా వీపూరి సురేష్, కొత్తగూడెం డీఎస్పీగా ఎస్కే అబ్దుల్ రెహమాన్‌ను, మిర్యాలగూడ డీఎస్పీగా వెంకటగిరి, హైదరాబాద్ మెట్రో రైల్ డీఎస్పీగా పి.బాలకృష్ణారెడ్డి, పెద్దపల్లి డీఎస్పీగా ఎ.మహేష్, మేడ్చల్ డీఎస్పీగా సామల వెంకటరెడ్డి, యాదాద్రి డీఎస్పీగా ఎన్.సైదులు, కూకట్‌పల్లి ట్రాఫిక్ ఏసీపీగా ధనలక్ష్మిని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.