బాధితులతో అహంకారంగా కరెంటు అధికారుల సమాధానం..
వాడు ఎస్సీవాడు అంటూ నాగర్ కర్నూల్ కరెంట్ AE అహంకారపు మాటలు..
హ్యూమన్ రైట్స్ టుడే/నాగర్ కర్నూల్/అక్టోబర్ 14: నాగర్ కర్నూల్ మండలం చందుబట్ల గ్రామంలో పండుగ ముందు రూ.23 వేల బిల్లు వేసి కరెంట్ తీసేసిన అధికారులు. అంత బిల్లు ఎందుకొచ్చింది, కరెంట్ ఎందుకు తీసేశారు అంటూ పై అధికారి అడిగితే వాడు ఎస్సీ వాడు సార్ అంటూ అహంకారంగా మాట్లాడిన AE గోపాల్ రెడ్డి. మేము ఊరిలోనే లేము అంత బిల్లు ఎందుకొచ్చిందని అడగగా బిల్లు కడితెనే కరెంట్ ఇస్తామంటూ మాట్లాడిన అధికారి.