ఇల్లరికం వచ్చాడని అల్లుడిపై చిన్నచూపు చూసిన అత్తా మామలు..
మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలను చంపి, ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
హ్యూమన్ రైట్స్ టుడే/నాందేడ్/అక్టోబర్ 14: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయగావకు చెందిన శ్రీనివాస్ రెడ్డి(36) 12 ఏళ్ల క్రితం కామారెడ్డి జిల్లా నందివాడకు చెందిన చిట్టెపు గుండారె, సుగుణవ్వల కుమార్తె అపర్ణను వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చాడు. అయితే కొన్ని రోజులుగా శ్రీనివాస్ రెడ్డికి భార్య, అత్తమామలతో విభేదాలు వచ్చాయి. నువ్వు ఇల్లరికం వచ్చావ్ అంటూ అత్త మామ, భార్య పెత్తనం పెరగడం ఆయనను మరింత మనస్తాపానికి గురిచేసింది.
దీంతో 6 నెలల నుంచి శ్రీనివాస్ రెడ్డి వేరుగా ఉంటున్నాడు. క్రికెట్ బెట్టింగ్, జూదానికి అలవాటు పడిన శ్రీనివాస్ రెడ్డి రూ.లక్ష వరకు అప్పు చేసినట్లు తెలిసింది.
ఇలా కుటుంబ కలహాలు, అప్పులు పెరగడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. దీంతో దసరా సందర్భంగా బంధువులకు జమ్మి పెడతానని కుమారులు విగ్నే శ్రీరెడ్డి(4), అనిరుధ్ రెడ్డి(6)లను తీసుకెళ్లాడు.
వ్యవసాయ భూమి పక్కన ఉన్న బావిలో ఇద్దరు పిల్లలను తోసి, ఆపై తాను కూడా దూకాడు.
మరుసటి రోజు తెల్లవారు జామున ముగ్గురి మృత దేహాలు బయపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.