FTL, బఫర్ జోన్ పూర్తి డీటైల్స్‌తో వెబ్‌సైట్ – ఇక జాగ్రత్త పడొచ్చు !
హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్/అక్టోబర్ 14: హైదరాబాద్‌లో సొంత ఇల్లు లేదా స్థలం కొనుక్కునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని హైడ్రా గుర్తు చేసింది. హైదరాబాద్‌లో చాలా వరకు చెరువులు, నాలాలను ఆక్రమించి లేఔట్లుగా మార్చి రియల్టర్లు అమ్మేస్తున్నారు. చెరువులకు ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లలో నిర్మాణాలకు అనుమతించరు. పట్టా భూమి అయినప్పటికీ అనుమతులు ఉండవు. అధికారులకు లంచాలు ఇచ్చి అనుమతులు తెచ్చి కట్టినా అవి కూల్చేస్తారు. ఇప్పుడు హైడ్రా చేసింది అదే.
ఇలాంటి చోట్ల మోసపోకుండా ప్లాటు లేదా ఇల్లు, బఫర్ జోన్, FTL పరిధిలో ఉందా లేదా అనేది తెలుసుకోవడం పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు ఆ సమస్యను సులువుగా పరిష్కరించేందుకు హెచ్‌ఎండీఏ వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాదులో ఉన్న చెరువులను గుర్తించి, వాటి బఫర్ జోన్ నిర్ణయించింది. lakes.hmda.gov.in లో పూర్తి వివరాలు పెట్టింది.
ఈ వెబ్‌సైట్‌లో జిల్లా, మండలం, గ్రామం పేరు ఆధారంగా మీ స్థలం బఫర్ జోన్ లేదా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు.
బఫర్ జోన్‌లో వ్యవసాయం లేదా ఇతర వ్యవసాయ సంబంధిత పనులు చేసుకోవచ్చు. కానీ శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. వీటికి పట్టా కూడా ఉంటుంది. ఈ పట్టాను అడ్డం పెట్టుకొని శాశ్వత నిర్మాణాలు చేపట్టి కస్టమర్లకు విక్రయిస్తున్నారు కొన్న ప్లాటు బఫర్ జోన్ లేదా ఎఫ్‌టీఎల్ పరిధిలో కనుక ఉన్నట్లయితే అది నివాసయోగ్యం కాదు అని తెలుసుకుని దాన్ని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి.
Related Posts