హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ క్రైమ్/అక్టోబర్ 13: దసరా పండుగ పూట కళ్ళు కూడా సరిగ్గా తెరవని, శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
మనుషుల్లో క్రూరత్వం ఎంత ఉందో మంచితనం కూడా అంతే ఉంది. యూపీలోని ఘజియాబాద్ లో జరిగిన ఓ ఘటనే దీనికి రుజువు. అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు ఘజియాబాద్ లోని చెట్ల పొదల్లో వదిలేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకొని, ఆ ఆడ బిడ్డను చూసి చలించి పోయాడు. చిన్నారి కుటుంబం కుల ఆచూకీ కోసం వెతికిన వారి వివరాలు తెలియ రాలేదు.
దీంతో చలించిపోయిన ఎస్సై పుష్పెంద్ర సింగ్, దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చాడు. పెళ్లై ఆరేళ్లెనా ఆయనకు పిల్లలు కలగలేదు. దీంతో విజయ దశమి రోజు ఆ దుర్గమ్మే మా ఇంటికి వచ్చిందని, భావించి భార్యతో కలిసి ఆ పసిబిడ్డను దత్తత తీసుకున్నాడు. ఎస్సై చేసిన మంచి తనంపై స్థానికులు సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.