కార్యకర్తను పట్టించుకునే టైమ్ లేదా?
ఫ్లెక్సీ వేసేవాడు – కార్యకర్త
ఓట్లడిగేవాడు – కార్యకర్త
ఓట్లు వేయించేవాడు – కార్యకర్త
డబ్బు పంచేవాడు – కార్యకర్త
తేడావస్తే జైలుకెళ్ళేవాడు – కార్యకర్త
భాణసంచా కాల్చేవాడు – కార్యకర్త
నాయకుల జయంతులు జరిపేవాడు – కార్యకర్త
నాయకుల వర్థంతులు జరిపేవాడు – కార్యకర్త
నాయకులు వస్తే పులీహారాలు చేసే వాడు – కార్యకర్త
నాయకులను పూలపై నడిపించేవాడు – కార్యకర్త
కార్యక్రమాలకు జనాలను తరలించేవాడు – కార్యకర్త
తరలించిన జనాల బాగోగులు చూసేవాడు – కార్యకర్త
అనునిత్యం జనాలలో ఉండేవాడు – కార్యకర్త
పార్టీకి_వెన్నుముక – కార్యకర్త
పార్టీ పథకాలకు ప్రచారం కల్పించేవాడు – కార్యకర్త
పార్టీని అధికారం వైపు నడిపించేవాడు – కార్యకర్త
ముఖ్యంగా ఏ పార్టీకైనా కార్యకర్త అనేవాడు చాలాముఖ్యం, అందువల్లనే కార్యకర్తలు పార్టీకి వెన్నుముక లాంటి వారు వాళ్ళను పార్టీ విస్మమరించటం మంచిది కాదు.
హ్యూమన్ రైట్స్ టుడే – ప్రత్యేక కథనం – అక్టోబర్ 13:
కార్యకర్తలను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రసన్నం చేసుకోవటం అధికారం రావటంతో తమ అను మయులని (పనులు పదవులు) పక్కలోనేపెట్టుకొని కార్యకర్తలను దూరంగా పెట్టటం అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. అలా చేయటం వలన పార్టీ ఓటమి జరుగుతుంది. ఓడిపోయాక కార్యకర్తలు గుర్తుకు వచ్చినట్లు నటించటం చేస్తూ పబ్బం గడుపుకోవటం రాజకీయ పార్టీల లక్షణం. కార్యకర్త అనేవాడు హారతి కర్పూరంల కరిగిపోవటమే కానీ గౌరవించడం లేనేలేదు అందువలనే రాజకీయ పార్టీలు సిద్ధాంతాలతో 40 శాతం ఓటు బాంక్ లు ఉండేవి ఇపుడు ఏ రాజకీయ పార్టీకి ఓటు బాంక్ శాతం గణనీయంగా తగ్గిపోతుంది. ముందు ముందు పార్టీలకు కార్యకర్త అనేవాడు మిగలని పరిస్థితి దాపురిస్తుంది.
మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త శక్తివంచన లేకుండా కష్టపడి పని చేసిన విషయం తెలిసిందే. ఎన్నో అక్రమ కేసులు, ఆస్తులు అమ్ముకుని రోడ్డు మీద పడటం, ఆస్తులను లాక్కోవటం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద భౌతిక దాడులు, ఈడి కేసులు ఇలా ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. తీరా ఇప్పుడు చూస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను పట్టించుకున్న నాధుడే లేడు. అధికారంలోకి వచ్చేసరికి కార్యకర్త గుర్తుకు రావడం లేదా? కార్యకర్తను పట్టించుకునే టైమ్ లేదా?
ప్రతి కార్యకర్త ఆలోచించండి..!!
తస్మాత్ జాగ్రత్త..!!