గతంలో గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న కానిస్టేబుల్ సూసైడ్..
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం..
పురుగుమందు తాగి ఆత్మహత్య కు సిద్ధమైన కానిస్టేబుల్..
సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్..
పలువురు ఎస్సైలు పేర్లు సూసైడ్ వీడియోలో వెల్లడి చేసిన కానిస్టేబుల్..
హ్యూమన్ రైట్స్ టుడే/బధ్రాద్రికొత్తగూడెం/అక్టోబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లో గంజాయికి సంబంధించిన కేసులో తనను అన్యాయంగా ఇరికించారని ఆరోపణలు చేస్తూ సూసైడ్ వీడియో రిలీజ్ చేసిన కానిస్టేబుల్.బూర్గం పహాడ్ లో బడాబాబుల హస్తం ఉందని గంజాయి రవాణా లో ఉన్నట్లుగా వీడియోలో వివరాలు వెల్లడి. హాట్ టాపిక్ గా కొనసాగుతున్న కానిస్టేబుల్ సూసైడ్ వీడియో పలువురు బిఆర్ఎస్ నాయకులు, పోలీసు వారు అండదండలతో గంజాయి దందా సాగినట్లు తనను అన్యాయంగా ఇరికిచ్చినట్లు వీడియోలో వెల్లడి చేసిన కానిస్టేబుల్.
విషమంగా ఉన్న కానిస్టేబుల్ పరిస్థితి మెరుగైన వైద్యానికి తరలించినట్లు సమాచారం.