డిప్యూటీ తాసిల్దార్ ప్రమోద్ 50,000 డిమాండ్..
రైస్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం..
రూ.50,000 ఇస్తే లేదా చావు నాకేంటి అంటూ అవహేళన..
ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్న జన్యావుల సుధాకర్ (నాని)..
హ్యూమన్ రైట్స్/అమరావతి/ఏలూరు సిటీ/అక్టోబర్ 12: వివరాల్లోకొస్తే స్థానిక ఏలూరు పట్టణానికి చెందిన జన్యావుల సుధాకర్(నాని)అనే వ్యక్తి పినకడిమి గ్రామంలో 13 బస్తాలు *ఆరున్నర* క్వింటాల్ బియ్యం కొనుగోలు చేస్తుండగా డిప్యూటీ తాసిల్దార్ ప్రమోద్ అక్కడికి చేరి తనకు 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.50,000 ఇస్తే కేసు ఉండదని, లేకపోతే నీ చావు నువ్వు చావని అసభ్యకరంగా మాట్లాడడం వలన తాను మనస్థాపన చెందానని ఆత్మహత్యాయత్నం చేసుకున్నానని దానికి పూర్తి కారణం డిప్యూటీ తాసిల్దార్ ప్రమోదనని, ఆ బస్తాలకు నా వ్యాన్‌కు ఎటువంటి సంబంధం లేకపోయిన కానీ కావాలని ఆ బస్తాలు నా వ్యాన్‌లో ఎక్కించి అన్యాయంగా కేసు నమోదు చేసారని తెలిపారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు తగిన విచారణ చేసి న్యాయం చేయాలని జన్యావుల సుధాకర్ (నాని) కోరారు.