నాకు న్యాయం చేయండి అంటు ఆవేదన వ్యక్తం చేస్తున్న ముంగర శైలజ అనే మహిళ…
హ్యూమన్ రైట్స్ టుడే/నెల్లూరు: నెల్లూరు జిల్లా నగరం లోని నవాబు పేటకు చెందిన ముంగర శైలజ అనే మహిళ ఇరిగేషన్ శాఖాలో పని చేసే తన భర్త అయిన మురళీ కృష్ణ యాదవ్ తనను మోసం చేసి అక్రమంగా వేరే మహిళతో కాపురం చేస్తూ తప్పుడు ధృవపత్రాలు సృష్టించి తనను మోసం చేస్తున్నారని తనకి న్యాయం చేయాలని ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ కృష్ణ మోహన్ ను కలిశారు. గతంలో నిలదీసినందుకు మురళీ కృష్ణ యాదవ్ ఇరిగేషన్ కార్యాలయం లోనే అందరి ముందు దాడి చేశాడని మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
నెల్లూరులో మురళీ కృష్ణ యాదవ్ అనే వ్యక్తితో 2007 లో తనుకు పెళ్ళైనట్లు పెళ్లైన కొన్ని రోజుల తర్వాత తన భర్త ప్రతిమా అనే మరో మహిళతో పరిచియం పెంచుకుని అమేతో సహజీవనం చేస్తూ లీగల్ గా భార్య నైన నాకు అన్యాయం చేస్తూ ఆమెతో వుంటూ నన్ను నా బిడ్డను నిర్లక్యం చేస్తూ వున్న మురళీ కృష్ణ యాదవ్ పై చర్యలు తీసుకోవాలి. నా భర్త ఇప్పటికే ఆధార్ కార్డులు, హెల్త్ కార్డు లు, అలాగే ఉద్యోగం చేసే ఆఫీసు లోని ఎస్ ఆర్ రిజిస్ట్రర్ లో కూడా ఆమె పేరు నమోదు చేసి వున్నాడు. తప్పుడు పత్రాలు సృష్టించడం, ప్రభుత్వాన్ని మోసం చేయడం, కోర్టులను తప్పు దోవ పట్టించడం లాంటి అనేక మోసపూరిత పనులు చేసిన తన భర్త పై చట్ట పరమైన చర్యలు తీసుకుని తనకు, తన బిడ్డకు న్యాయం జరిగేలా చూడాలి అని మహిళ అధికారులను వేడుకొన్నారు.