సారీ చెప్పేది లేదు.! తిరుమలలో కేసుపై దివ్వెల మాధురి రియాక్షన్..

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/అక్టోబర్ 12: ఏపీలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన స్నేహితురాలు దివ్వెల మాధురి మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. తిరుమలలో దివ్వెల మాధురిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. రీల్స్ చేస్తూ శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ దివ్వెల మాధురిపై తిరుమలలో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తిరుమలలో కేసుపై దివ్వెల మాధురి స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమపై కేసులు పెట్టారని దివ్వెల మాధురి ఆరోపించారు. తనపై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తానని దివ్వెల మాధురి స్పష్టం చేశారు. తిరుమలలో తాను ఎలాంటి తప్పూ చేయలేదన్న దివ్వెల మాధురి చేయని తప్పునకు ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని తెగేసి చెప్పారు. ఓ కార్యకర్తగా దువ్వాడతో కలసి తిరుమల వెళ్లానన్న దివ్వెల మాధురి. తమతో పాటుగా మరికొందరు కార్యకర్తలు కూడా వచ్చినట్లు తెలిపారు. మమ్మల్ని ప్రశ్నించేవారు పవన్ కళ్యాణ్‌ను ఎందుకు ప్రశ్నించరు అంటూ మాధురి నిలదీశారు. మరో వైపు తిరుమలలో తాము ఎలాంటి తప్పూ చేయలేదని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించాలని కోరుతున్నట్లు చెప్పారు. పోలీస్ కేసుపై న్యాయపరంగా ముందు కెళ్తామని దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మరోవైపు అక్టోబర్ ఏడో తేదీన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమలకు వెళ్లారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దివ్వెల మాధురి శ్రీవారి ఆలయం వెలుపల, పుష్కరిణి ప్రాంతాల్లో రీల్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విమర్శలు రావటంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది స్పందించారు. తిరుమలలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారంటూ తిరుమల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment